Suravaram Pratapa Reddy Statue

Wednesday 24 hours open

CF9J+4M2, Tank Bund Rd, Lower Tank Bund, Kavadiguda, Hyderabad, Telangana 500029, India
About

Suravaram Pratapa Reddy Statue is a historical landmark located in Hyderabad, Telangana. The average rating of this place is 4.80 out of 5 stars based on 4 reviews. The street address of this place is CF9J+4M2, Tank Bund Rd, Lower Tank Bund, Kavadiguda, Hyderabad, Telangana 500029, India. It is about 1.06 kilometers away from the Sanjivaiah railway station.

Photos
FAQs
Where is Suravaram Pratapa Reddy Statue located?
Suravaram Pratapa Reddy Statue is located at CF9J+4M2, Tank Bund Rd, Lower Tank Bund, Kavadiguda, Hyderabad, Telangana 500029, India.
What is the off day for Suravaram Pratapa Reddy Statue?
Suravaram Pratapa Reddy Statue is 7 days open 24hr
What is the nearest metro station from Suravaram Pratapa Reddy Statue?
Suravaram Pratapa Reddy Statue is nearly 1.19 kilometers away from Musheerabad Metro Station. You can go to this metro station by using the Metro MRT Green Line.
What is the nearest railway station from Suravaram Pratapa Reddy Statue?
Sanjivaiah railway station is the nearest railway station to Suravaram Pratapa Reddy Statue. It is nearly 1.06 kilometers away from it.
What people say about Suravaram Pratapa Reddy Statue

Shaik Jabbar 60 months ago

Nice

DURGA SAI DOMALA 48 months ago

తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి (మే 28, 1896 - ఆగస్టు 25, 1953). పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభా, కృషి అనన్యమైనది. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి ఆయన పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణలో కవులే లేరనే నిందావ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన "గోల్కొండ కవుల సంచిక" గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఫారసీ, ఆంగ్ల భాషలలో నిష్ణాతులు. గోల్కొండ పత్రిక, దానికి అనుబంధంగా భారతి సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా, పత్రికా రచయితగా ప్రసిద్ధి చెందారు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, గ్రంథాలయోద్యమము ఇతని ఇతర ముఖ్య రచనలు. నైజాం నిరంకుశ పాలనలో, తెలుగు వారి అణచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు, తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషిచేశారు. జీవిత చివరి దశలో రాజకీయాలలో కూడా ప్రవేశించి వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. తెలుగుజాతికి ఇతను చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించిన విగ్రహాలలో సురవరం విగ్రహం కూడా స్థానం పొందింది. 1955లోనే ఆంధ్రుల సాంఘిక చరిత్రము రచనకు గాను "కేంద్ర సాహిత్య అకాడమి" అవార్డు లభించింది.

జీవిత విశేషాలు

సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28 న జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని ఇటిక్యాలపాడు గ్రామంలో జన్మించారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ, తిరువాన్u200cకూరులో బి.ఎల్ అభ్యసించి కొంతకాలం పాటు న్యాయవాద వృత్తి నిర్వహించారు. అనేక భాషలలో ఈయన నిష్టాతుడు, మంచి పండితుడు. 1926 లో ఆయన నెలకొల్పిన గోలకొండ పత్రిక తెలంగాణ సాంస్కృతిక గమనంలో మైలురాయి. గోలకొండ పత్రిక సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించాయి. నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన పెట్టినాడు. దాన్ని తిప్పికొడుతూ ప్రతాపరెడ్డి ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించిండు. అది మరింత సమస్యగా ఆనాటి ప్రభుత్వం భావించింది.

తెలంగాణలో కవులే లేరని ఒక ఆంధ్ర పండితుడు ఎగతాళి చేస్తే దానికి ధీటుగా 354 మంది కవుల వివరములు మరియు వారి రచనలతో గోలకొండ కవుల సంచిక అనే సంకలనాన్ని 1934లో ప్రచురించి తిరుగులేని సమాధానం చెప్పిన వైతాళికుడు. తెలంగాణ వారికి ఆ సంచిక ఇప్పటికీ అపురూపమైనది. తెలంగాణాలో గ్రంధాలయోద్యమంలో ప్రతాపరెడ్డి ప్రముఖపాత్ర వహించారు. 1942 లో ఆంధ్ర గ్రంధాలయ మహాసభకు అధ్యక్షత కూడా వహించారు. 1943 లో ఖమ్మంలో జరిగిన గ్రంధాలయ మహాసభకు, 1944లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఆయనే అధ్యక్షుడు.
1951లో ప్రజావాణి అనే పత్రికను ప్రారంభించారు. 1952లో హైదరాబాదు రాష్ట్రానికి జరిగిన మొదటి ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తరపున వనపర్తి నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. న్యాయవాదిగా ఆయన జీవితం ప్రారంభించి, రచయితగా, కార్యకర్తగా, సంపాదకుడుగా జీవితం సాగించి తెలంగాణ ప్రజల హృదయాలలో ముద్రవేసుకున్నాడు. 1953 ఆగష్టు 25న ఆయన దివంగతుడైనారు.

రాజకీయాలు
సురవరంకు రాజకీయాల పట్ల ఆసక్తి లేకపోయిననూ సన్నిహితుల ప్రోద్బలంతో 1952లో జరిగిన తొలి ఎన్నికలలో వనపర్తి అసెంబ్లీ నియోజకరవర్గం నుంచి పోటీచేసి ప్రముఖ న్యాయవాది వి.రామచంద్రారెడ్డిపై విజయం సాధించి హైదరాబాదు శాసనసభకు ఎన్నికయ్యారు. కాని ప్రారంభం నుంచి రాజకీయాలకు దూరంగా ఉండటం, గ్రూపు రాజకీయాలు చేయకపోవడంతో జిల్లా వ్యక్తి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్ననూ ఇతనికి మంత్రిపదవి కూడా లభించలేదు. ఈ విషయంపై సురవరం స్వయంగా ఆయన ఆప్తుడైన రంగాచార్యులకు లేఖ వ్రాస్తూ "ఈ రాజకీయపు చీకటి బజారులో నేను, నా వంటివారు ఏమియును పనికి రారు" అని స్పష్టంగా పేర్కొన్నాడు.

Contact
Address
CF9J+4M2, Tank Bund Rd, Lower Tank Bund, Kavadiguda, Hyderabad, Telangana 500029, India
Suravaram Pratapa Reddy Statue's Timetable
Friday 24hr open
Saturday 24hr open
Sunday 24hr open
Monday 24hr open
Tuesday 24hr open
Wednesday 24hr open
Thursday 24hr open

N.B. The timetable is based on our last updated data on January 29, 2024.

Map Location